ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్ట్ ను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామ నాయుడు తో కలిసి సోమవారం సందర్శించనున్నారు.
ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తరువాత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. జనవరి 02 నుంచి ప్రారంబించబోయే కొత్త డయా ఫ్రం వాల్ పనులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రబుత్వం ఇటీవలే రూ.15వేల కోట్ల నిధులను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పర్యటనకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.