మా నాన్న శంకుస్థాపన చేస్తే..నేను పూర్తి చేశాను..ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ వెలిగొండ ప్రాజెక్ట్ వల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు మరియు 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడారు. మా నాన్న వెలిగొండ ప్రాజెక్ట్ కి శంకు స్థాపన చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ను నేను పూర్తి చేశాను. వెలిగొండతో దశాబ్దాల కల నెరవేరింది. అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ కొడుకుగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం చాలా గర్వంగా ఉంది. టన్నెల్ లో ప్రయాణించినప్పుడు సంతోషంగా కనిపించింది. రెండు టన్నెళ్లు ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్లు ఉన్నాయని తెలిపారు.