రాష్ట్రంలో మ‌రో సువ‌ర్ణాధ్యాయానికి జ‌గ‌న్ శ్రీకారం..

-

రాష్ట్రంలో ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌తో ముందుకు సాగుతున్న సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వం తాజాగా మ‌రో సువ‌ర్ణాధ్యాయానికి శ్రీకారం  చుట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు నానాటికీ తీసిక‌ట్టుగా ఉన్న ఆరోగ్య శ్రీ సేవల‌ను మ‌రింత పుంజుకునేలా చేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెట్టిన బాకీల‌ను తీర్చ‌డం తోపాటు.. ఆరోగ్య శ్రీ ఆసుప‌త్రుల‌ను, ఈ ప‌థ‌కం కింద ఇచ్చే సేవ‌ల‌ను కూడా రెట్టింపు చేశారు. ఇక‌, ఈ ప‌థ ‌కం ప‌రిధిలోకి వ‌చ్చే.. అంబులెన్సుల‌ను కూడా అధునాత‌నం చేయ‌నున్నారు.

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు.బుధవారం సీఎం వైఎస్‌ జగన్ విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను ప్రా రంభించనున్నారు. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు ప్రారంభిస్తున్నారు.
ఇక‌, 108 సర్వీసులో సమూల మార్పులు చేశారు. వాటిలో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్సు లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేశారు. ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపో ర్టు(ఏఎల్‌ఎస్‌)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
బీఎల్‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయగా, ఏఎల్‌ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోనేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. మొత్తంగా చూస్తే.. మ‌రో సువ‌ర్ణాధ్యాయానికి జ‌గ‌న్ స‌ర్కారు శ్రీకారం చుట్టింద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version