ట్రాన్స్‌కో సబ్ స్టేషన్లకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 28 కొత్త సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ 16 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలను వర్చువల్ విధానంలో చేయనున్నారు.

CM Jagan laid foundation stone for Transco sub stations today
CM Jagan laid foundation stone for Transco sub stations today

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా రూ. 3,100 కోట్ల వ్యయంతో వీటిని ట్రాన్స్ కో ఏర్పాటు చేస్తోంది. అలాగే కడపలో 750, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు సీఎం సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటివల్ల 1,700 మందికి ఉపాధి లభించనుంది. కాగా, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి జగనన్న ప్రభుత్వం అతి పెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరపబోతోంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన వాళ్లు పోటీ పడేలా తీర్చి దిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యం .

Read more RELATED
Recommended to you

Latest news