అంగన్ వాడి పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆదేశం

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం జగన్. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్ఓపి రూపొందించాలన్నారు.

క్రమం తప్పకుండా అంగన్వాడీలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. అలాగే అంగన్వాడీలలో నాడు – నేడు పనులపై ఆరా తీశారు సీఎం జగన్. ప్రతి అంగన్వాడీలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేసి తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే అంగన్వాడీలలో పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను కూడా ఉంచుకోవాలని నిర్దేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version