CM Jagan : విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి.
ఒక్కో బోటులో సుమారు రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులే నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చెందారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి… వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రి సిదిరికి ఆదేశాలు జారీ చేశారు.