రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్.. అమిత్ షా, మోడీలతో సమావేశం

-

ఇవాళ ఏపీకి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ తరుణంలోనే క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే… రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం జగన్‌ ఉండనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలవనున్నారు సీఎం జగన్.

కాగా, లండన్‌ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్. ఈ మేరకు లండన్‌ పర్యటన ముగించుకుని నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే సీఎం జగన్‌ ను రిసీవ్ చేసుకోడానికి ఎంపి లు బాలశౌరి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ఎంఎల్ఏ లు వల్లభనేని వంశీ, పార్ధసారధి, తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ వచ్చారు. ఈ సందర్బంగా సీఎం జగన్‌ కు బొకేలతో స్వాగతం పలికారు. అలాగే..సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు ప్రసాదంపాడు, రామవరప్పాడు, మహానాడు జంక్షన్, స్క్రూ బ్రిడ్జి ల వద్దకు చేరారు వైసీపీ కార్యకర్తలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version