ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

-

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నివాసానికి వెళ్ళనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అక్కడి నుంచి ఎ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.


ఈ సందర్భంగా జస్టిస్‌ మిశ్రా గౌరవార్ధం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ పీకే మిశ్రా… ఈ నేపధ్యంలో ఆయన గౌరవార్ధం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విందు సమావేశం ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version