ఏపీ గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్ ను ప‌రామర్శించిన సీఎం జ‌గ‌న్

ఇటీవ‌ల అనారోగ్యం తో బాధప‌డుతు చికిత్స తీసుకున్న ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తుల‌ను ముఖ్య మంత్రి జ‌గ‌న్ దంప‌తులు ప‌రామ‌ర్శించారు. కాసేప‌టి క్రితం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దంప‌తులు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ హ‌రి చంద‌న్ నివాసానికి వెళ్లారు. కాగ గ‌త కొద్ది రోజల క్రితం గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. క‌రోనా నియంత్ర‌ణ కు హైద‌రాబాద్ లో చికిత్స కూడా తీసుకున్నారు. క‌రోనా నుంచి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ భూష‌న్ హ‌రి చంద‌న్ కోలుకున్న త‌ర్వాత కొద్ది రోజుల కే తీవ్ర అస్వ‌స్థ‌తకు గురి అయ్యారు.

దీంతో గ‌వ‌ర్న‌ర్ హ‌రి చంద‌న్ ను మ‌ళ్లీ హైద‌రాబాద్ లోని ఏజీఐ ఆస్ప‌త్రి లో చికిత్స అందించారు. ఇటీవ‌ల ఆస్ప‌త్రి నుంచి గ‌వ‌ర్న‌ర్ హ‌రి చంద‌న్ డిశ్చార్జీ అయి ఆంధ్ర ప్ర‌దేశ్ కు చేరుకున్నారు. దీంతో వారిని తాజా గా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దంప‌తులు ప‌రామ‌ర్శించారు. ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. పూర్తి గా కొలుకునే వార‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కు సీఎం జ‌గ‌న్ అన్నారు. కాగ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశీస్సు ల‌తో ఆరోగ్యం గా ఉన్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.