సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ మరియు ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని… వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో ఉన్నది కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో డ్రైవింగ్ నైపుణ్యం ఉండి పలువురు మహిళలు ఆటోలను కిరాయికి తీసుకొని నడుపుకుంటున్నారు.
ఇకపై వారు అధ్యవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం జగన్ ఆధ్వర్యంలో అధికారులు మహిళా శక్తికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు 10 శాతం చెల్లిస్తే… 90 శాతం ప్రభుత్వం రుణంగా ఇస్తుంది. రుణాన్ని 48 నెలలు వాయిదాలుగా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మండలానికి ఒకరు చొప్పున ఈ ఆర్థిక ఏడాది 660 మందికి ఆటోలు ఇవ్వనుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వడ్డీ రాయితీ కారణంగా ఒక్కో లబ్ధిదారునికి లక్షన్నర దాకా అదనపు లబ్ధి చేకూరాలని ఉంది. డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్ధంతి రోజున 229 మందికి కొత్త ఆటోలు ఇవ్వనున్నారు.