CM Jagan : 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

-

సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ నెల 14న శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మకరంపురం గ్రామంలో ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ను ఆయన ప్రారంభించనున్నారు.

CM Jagan’s visit to Srikakulam district on 14th

అనంతరం పలాసలో వైయస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు తెలియజేశారు.11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీలను నియమించినట్లు తెలిపారు. స్థాన చలనం జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news