రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ

-

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి పెట్టుబడి సాయం విడుదలైంది. రబీ సీజన్ కోసం పంట పెట్టుబడి కింద ఎకరాకు రూ.అయిదేసి వేల చొప్పున సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15 వేల సాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా తాము హామీ ఇచ్చినా.. విధివిధానాలు ఇంకా ఖరారు కానందువల్ల ప్రస్తుతానికి రైతుబంధు నిబంధనల మేరకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్లు రేవంత్ తెలిపారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు  రూ.2 లక్షల మేరకు రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని సూచించారు. రూ.2 లక్షల మేరకు రైతు రుణమాఫీకి ఎంత వ్యయమవుతుందో వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. అన్నదాతలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news