ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

-

 

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. మొదటగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని, ఆ తర్వాత జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. అనంతరం తాడెపల్లి గూడెంకు తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news