సీఎం జగన్‌ కీలక నిర్ణయం..అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం

-

సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.అసని తుఫాన్‌ పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని కోరారు.అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం చెల్లించాలని అదేశించారు.

CM JAGAN

పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని… సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పని చేసేలా చూడాలని కోరారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించండని.. ఈ నెంబర్లకు బాగా ప్రచారం కల్పించండని ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ‘అసని’.. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ., కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 550 కి.మీ., పూరీకు 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version