కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ , టీడీపీ మధ్య మాటల యుద్ధం నడించింది. ప్రభుత్వ హామీలపై వైసీపీ సభ్యులు నిలదీశారు. తాగునీటి విషయంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ బి.వై.రామయ్య, టీటీపీ సభ్యుడు పరమేష్ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలు చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్ పెద్దగా అరుస్తూ కుర్చీలు నెలకేసికొట్టారు.
దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వైసీపీ కార్పొరేటర్లు అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలేదని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు.