దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల పోలవరం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం ఎత్తు విషయంలో బీజేపీతో చంద్రబాబు, జగన్ రాజీపడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులు షర్మిలను కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు ఎత్తులో కడతామని జగన్, చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే భావనతోనే జగన్ సీఎంగా ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని.. నవరత్నాల్లో పెట్టీ మరీ జగన్ చెప్పారని గుర్తు చేశారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ఎత్తు విషయంలో సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కూడా తామేమీ తక్కువ తినలేదనే విధానంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే వైసీపీ, టీడీపీ నాయకుల్లో ఒక్కరూ కూడా నోరు విప్పలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.