వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి – తులసిరెడ్డి

-

వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు తులసి రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి జగన్ మోడీ రాహుకేతువుల్లా తయారయ్యారు…మోడీ అప్పులుపాలు చేసి దేశాన్ని తాకట్టు పెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు.సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ గా దేశాన్ని బీజేపీ తయారుచేస్తుంది…జగన్ అప్పులుపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడని ఆగ్రహించారు.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రుణాంద్రప్రదేశ్ గా మార్చాడు…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాలిబన్ల పాలనను మించిపోయిందని నిప్పులు చెరిగారు మాఫియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా, డ్రగ్స్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని జగన్ మార్చేశాడని మండిపడ్డారు. జగన్ పాలన అప్పులు ఫుల్, అవినీతి ఫుల్ గా మారిందన్నారు.వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోడీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి…ఈ మూడు పార్టీలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈడినట్లే వుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసుకుందామని పిలుపునిచ్చారు తులసిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version