దిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి మార్చి 21వ తేదీన ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లలో అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా తొమ్మిదోసారి.
ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన స్పందించకపోవడంతో దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరవ్వగా.. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ వచ్చిన మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ ఆయనకు సమన్లు జారీ చేయడం గమనార్హం. మార్చి 21న కేజ్రీవాల్ విచారణకు హాజరైతే ఈ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.