విజయనగరంలో భారీ పేలుళ్లకు కుట్ర..!

-

విజయనగరంలో భారీ పేలుళ్లకు కుట్ర జరిగింది. విజయనగరంలో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు సిరాజ్, సయ్యద్ సమీర్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు.

Conspiracy for major explosions in Vizianagaram
Conspiracy for major explosions in Vizianagaram

కాగా.. ఈ నిందితులు హైదరాబాద్‌లో కూడా భారీ పేలుళ్లకు కుట్రపన్నినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు పహల్గామ్‌కు జ్యోతి మల్హోత్రా వెళ్ళింది. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లదించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news