ఏలూరు జిల్లా దెందులూరు లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఓ వేడుకలు ఎమ్మెల్యే చింతామణి ప్రభాకర్ కారుకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వాహనాన్ని అడ్డుపెట్టారు. దీంతో అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ పై చింతమనేణి మండిపడ్డారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో దెందులూరు లో రాజకీయ వంట ఒక్కసారిగా వేడెక్కింది.
అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతామనేనిగా మారిపోయింది. దీంతో పరస్పరం ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే అబ్బాయి చౌదరి గొడవలకు ప్రేరేపిస్తున్నారని చింతమనేని అన్నారు. తమ వాళ్లను తిడితే కూర్చుంటారా అని మండిపడ్డారు. మరోవైపు అబ్బాయా చౌదరి కూడా మీడియాతో మాట్లాడారు. తనను తన కుటుంబాన్ని అంతా మన్నించే కుట్ర చేస్తున్నారని అనుమానం కలుగుతుందని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. చింతామణి కారుకు మా కారు అడ్డు పెట్టలేదు. కావాలనే చింతామణి నానా యాగి చేశారు మా డ్రైవర్ను బూతులు తిట్టారు. చింతామణి కారు వెళ్లేందుకు సరిపడా స్థలం ఉంది. చింతామణి తీరు అటు టిడిపి నేతలు కూడా తప్పుపడుతున్నారు. వైసిపి నాయకులపై చింతామణి కక్ష సాధింపులకు దిగారని అబ్బాయి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.