తెలంగాణను కేటీఆర్ క్యాసినో హబ్ గా మార్చారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల ఆపరేషన్ లో ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం బయటపడింది అన్నారు. దొంగలకు లీజుకి ఇచ్చిన వాళ్లు కూడా దొంగలే అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ డ్రగ్స్ బిజినెస్ లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే ఇస్తారు ఇత్తినా దోచుకొని రాష్ట్రాన్ని క్యాసిన హబ్ గా మార్చారని మండిపడ్డారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అరాచకాలకు కారణం కేటీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నా కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు ఎవరికి గుర్తే లేదని.. కేటీఆర్ తో చేసిన దందాలతో మళ్ళీ తెరపైకి వచ్చాడని విమర్శించారు.
ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నట్టు అద్దంకి దయాకర్ తన మనసులోని మాటను బయటపెట్టారు. దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని తోల్కట్టలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్నారనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.