BREAKING: శ్రీశైలంలో పిస్టల్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య

-

శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో పిస్టల్ తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రీ డ్యూటీ లో వుంటూ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు కానిస్టేబుల్‌ శంకర్ రెడ్డి, పిసి 570 (26). 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన శంకర్ రెడ్డి…అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Constable commits suicide by shooting himself with a pistol in Srisailam

అయితే.. శంకర్ రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా…ఆర్థిక సమస్యలా, దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందికొట్కూరు మండలం దామగట్లకు చెందిన శంకర్ రెడ్డి అవివాహితుడు. కర్నూలు కృష్ణానగర్ లో నివాసముంటున్నాడు శంకర్ రెడ్డి. ఇటీవలే నంద్యాల జిల్లాకు బదిలీ చేయించుకున్న శంకర్ రెడ్డి..అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version