జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కొంపముంచింది. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఏపీలోని ఏలూరులో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం..ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఏలూరులోని ముదినేపల్లి మండలం వూరుకూరు గ్రామంలో బాలకోటయ్యను కత్తులతో నరికి చంపారు ప్రత్యర్ధులు.
గత మే నెలల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను గ్రామంలో పెట్టిన సందర్భంలో గ్రామస్తులతో వివాదం చెలరేగిందట. ఆ కక్షల కారణంగా ఇవాళ దారి కాచి చెరువు నుంచి వస్తున్న బాలకోటయ్యను హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం..కారణంగానే హత్య జరిగిందా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.