ఏపీలో కరోనా కలవరం.. రాజమహేంద్రవరంలో తొలి కేసు నమోదు?

-

కరోనా మహమ్మారి రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ తర్వాత రూపం మార్చుతూ న్యూ వేరియంట్లతో మళ్లీ మళ్లీ భయపెట్టింది. ఇక సమూలంగా నాశనమైందని సాధారణ జీవితాన్ని గడుపుతున్న సమయంలో మళ్లీ విలయం సృష్టించేందుకు మరో కొత్త రూపం దాల్చింది. జేఎన్1 వేరియంట్ రూపంలో మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు వేగంగా వ్యాపిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది.

ఈ మహమ్మారి మళ్లీ భారత్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకూ ఈ వైరస్ పాకింది. నిన్నటి దాకా తెలంగాణలోనే పదుల సంఖ్యలో నమోదైన కొవిడ్ కేసులు ఇవాళ ఏపీకి వ్యాపించాయి. ఆంధ్రాలో తొలి కరోనా కేసు నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ వృద్ధురాలికి కొవిడ్‌ సోకిందన్న ప్రచారం ఇప్పుడు ఏపీ ప్రజలను కలవరానికి గురి చేస్తోంది.

నగరంలోని దానవాయిపేటకు చెందిన 84 ఏళ్ల వృద్ధురాలికి లక్షణాలు ఉన్నాయని ర్యాపిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. వైద్యసిబ్బంది నమూనాలను కాకినాడలోని ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌కు పంపగా అక్కడ సైతం పాజిటివ్‌ వచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news