భారత్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు

-

వచ్చే ఏడాది ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ భారత్లో పర్యటించనున్నారు. గణతంత్ర వేడుకలకు ఆయణ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు కేంద్ర అధికారిక వర్గాలు ఇవాళ వెల్లడించాయి. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను బిజీగా ఉన్నానని బైడెన్ ఇటీవలే తెలిపారు. అందువల్ల హాజరు కాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు సమాచారం. గత ఏడాది గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌సీసీ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జులైలో పారిస్‌లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ జరిగిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ బాస్టిల్‌ డే పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో భారత్‌ వేదికగా దిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెక్రాన్‌ మాట్లాడుతూ.. భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీతో చర్చలు జరిగాయని అన్నారు. బాస్టిల్‌ డే పరేడ్‌కు మోదీ హాజరుకావడాన్ని తమ దేశ ప్రజలు గౌరవంగా భావించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news