ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తారా స్థాయికి చేరుకుంది. రోజు రోజు కు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 4,528 కరోనా పాజిటివ్ కేసులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో 4,528 కరోనా కేసులు వెలుగు చేశాయి.
అలాగే కరోనా కాటుకు రాష్ట్రంలో ఒకరు మరణించారు. అలాగే రాష్ట్రంలో ఈ రోజు 418 మంది కరోనా వైరస్ నుంచి కొలుకున్నారు. దీంతో రాష్ట్రంలో 18,313 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతన్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ కూడా విధించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి నైట్ కర్ప్యూ అమలు కానుంది.