స్పైస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు ఉదయం 7:45 గంటలకు స్పైస్ జెట్ విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి బయలుదేరింది. అయితే తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్‌కు అనుమతించలేదు.