ఆ మహిళకు జగన్ దేవుడు

-

ఏపీ సర్కార్ 108 వాహనాలను భారీగా అందుబాటులోకి తీసుకు రావడంపై దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ పరిణామం చూసి హర్షించారు కూడా. గతంలో 108 అంబులెన్స్ లు పనికిరాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందరో మహిళల కాన్పుల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 108 లో కరోనా గర్భిణీ కాన్పు పరిణామం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

సత్యవేడు బిసి కాలనీకి చెందిన నాగలక్ష్మి అనే గర్భిణీ స్త్రీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా సత్యవేడు ఆసుపత్రి డాక్టర్లు తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి రెఫర్ చేసారు. తీసుకెళుతున్న వాహనంలోనే నొప్పులు విపరీతం అవ్వడంతో 108 సిబ్బంది టి.సుబ్బలక్ష్మి రేణిగుంట సమీపంలో వెంటనే డెలివెరీ చేసి సురక్షితంగా ఇద్దరి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version