విజన్ డాక్యుమెంట్స్ 2040 ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అన్ని రంగాల్లో డ్రోన్ వినియోగం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక అంటూ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. టెక్నాలజీ వినియోగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారు. మహిళల భద్రత కోసం డ్రోన్స్ ఉపయోగించవచ్చు. డ్రగ్స్ అరికట్టడానికి డ్రోన్స్ ఉపయోగించవచ్చు. క్రైమ్ ఎక్కడ ఎక్కువుగా ఉంటే అక్కడ డ్రోన్స్ ఉపయోగించవచ్చు . బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించడం,ర్యాగింగ్ ప్రాంతాలను మ్యాపింగ్ చేశాం. పోలీసు వెళ్ళలేని ప్రాంతానికి డ్రోన్ వెళుతుంది. విజిబుల్ పోలీసింగ్ తో పాటు ఇన్ విజిబుల్ పోలీసింగ్ కూడా చాలా అవసరం.
డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. డ్రోన్ వినియోగం ఆర్థికపరమైన అంశం. ఎంపీ దృష్టికి తీసుకువెళ్ళిన సమయంలో 10 డ్రోన్ లు అందించారు. చాలా సంతోషం. విజయవాడ ప్రజలు దాతృత్వం కలిగినవారు. అస్త్రం అనే యాప్ ద్వారా నగరంలో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నాం. 500 మంది మహిళా పోలీసులను డ్రోన్ పైలెట్స్ గా తర్ఫీదు ఇచ్చాం. క్లౌడ్ పాట్రోల్ త్వరలోనే లాంఛ్ చేస్తాం అని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు.