పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం ఎంతో క్రూరమైంది.. అరాచకమైనదని పేర్కొన్నారు. సనాతన ధర్మంలో విడాకులే ఉండవు, ఎలాంటి సమస్యలొచ్చినా భార్యాభర్తలు కలిసే ఉండాలని తెలిపారు. మరి.. సనాతన ధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్ మూడు సార్లు ఎలా విడాకులు తీసుకున్నాడు? అని ప్రశ్నించారు.

ఇలాంటి సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌ను కచ్ఛితంగా అరెస్ట్ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు సీపీఐ నారాయణ. ఇక పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేసిన తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.