బిగ్ న్యూస్: “ప్రధాని క్యాండిడేట్” ఛాన్స్ మిస్సయిన బాబు!  

-

జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పిన చరిత్ర చంద్రబాబు సొంతం! రాష్ట్రపతులను ఎంపిక చేసే విషయంలో బాబు చెప్పిన పేర్లను, ప్రతిపాదనలకు చాలా విలువ ఉండేది! గట్టిగా చెప్పాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చంద్రబాబుకు గ్రిప్ ఉంది! దేశంలోని పెద్ద పెద్ద నేతలంతా చంద్రబాబును రాజకీయంగా సలహాలూ సూచనలూ అడుగుతుంటారు! బాబును జాతీయస్థాయిలో అంతా కోరుకుంటారు! అటు మోడీతోనూ.. ఇటు సోనియా గాంధీతోనూ కూడా వేదికలు పంచుకున్న క్రెడిట్ బాబు సొంతం! అలాంటి బాబుకు మరోసారి జాతీయస్థాయిలో చక్రం తిప్పే చాన్స్ వస్తే చేతులారా మిస్ చేసుకున్నారు!

అవును… ఇదే విషయంపై ప్రస్తుతం సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ కూడా బాద పడుతున్నారు! చంద్రబాబు చిరకాల మిత్రులు సీపీఐ నారాయణ తాజాగా మైకుల ముందుకు వచ్చారు. బాబుపై తనకున్న ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో వైకాపా ను చంద్రబాబు వ్యతిరేకింంచాలని కోరుతున్నారు.. కాదు కాదు బలంగా డిమాండ్ చేస్తున్నారు! తద్వారా బాబుకు కలిగే ప్రయోజనం కూడా చెబుతున్నారు!

వ్యవసాయ బిల్లుల విషయంలో చంద్రబాబు మోడీకి అనుకూలంగా మారి..  రైతు వ్యతిరేకిగా మారారని మొదలుపెట్టిన నారాయణ… బీజేపీకి అనుకూలంగా మారడం వల్ల జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే గొప్ప ఛాన్స్‌ పోగొట్టుకున్నారని బాదపడ్డారు! ఇలాంటివి చంద్రబాబు ఎన్నో మిస్ చేసుకున్నారు… కేంద్రం అనేక ప్రజా వ్యతిరేక బిల్లుల్ని, చట్టాల్ని తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ వ్యతిరేకించలేదు! వ్యతిరేకించి ఉంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ నడిపించే సువర్ణావకాశం బాబుకు దక్కేది అని నారాయణ చాలా బాదపడుతూ స్పందించారు!

నారాయణ చెప్పారని కాదు కానీ… నిజంగా బాబుకు దేశరాజకీయాల్లో మంచి గ్రిప్ ఉంది! ఈ సమయంలో బీజేపీ ఎలాగూ బాబుని దరిచేరనివ్వడంలేదు కాబట్టీ… జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నంటినీ కలిపి.. వాటికి తానే బాధ్యత వహిస్తూ ముందుకు నడిపిస్తే… తృతియ ఫ్రంట్ తరుపున ప్రధాని అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు కదా!! ఏపీని చినబాబుకు అప్పగించి బాబు అలా హస్తిన రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version