ఏపీలో మేం టిడిపితో కలిసిపోటీ చేస్తాం – సీపీఐ

-

ఏపీలో మేం టిడిపితో కలిసిపోటీ చేస్తామని సీపీఐ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. వైసిపీ, సీపీఐ మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో క్లారిటీతో ఉన్నాయి… మేం టిడిపితో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పోటీ చేస్తామన్నారు. వైసీపీ కేంద్రంలో బిజెపి తో కలిసి పని చేస్తోంది..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుంది…గౌతం అదానీకి గ్రీన్ ఛానెల్ వెల్కం చెప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 1400 ఎకరాల భూమిని అమ్మడానికి అమిత్ గుప్తా కు అప్పజెప్పారు.. 1400 ఎకరాలు దక్కించుకోడానికే సీఎం తో అదానీ భేటీ జరిగిందని ఆరోపించారు. కమ్యూనిష్టులు అమ్ముడు పోయారని సజ్జల అనడం దురదృష్టం అన్నారు. సజ్జల మాటలు ఆయన మాస్టర్ చెప్పించిన మాటలుగా భావిస్తున్నామన్నారు. జీవీఎల్ ఏనాడూ విశాఖ స్టీల్ ప్లాంటు ధర్నాల వద్దకు పోలేదని.. ఇన్నాళ్ళూ జీవీఎల్ గాడిదలు కాస్తున్నాడా…అని ఆగ్రహించారు. స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయడానికి కూడా అదానీకి అప్పజెప్పారని.. చండీగఢ్ లో 9000 ఉన్న స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో 30వేలు ఎలా అయ్యాయన్నారు. అమిత్ షా, మోదీ, అదానీ, జగన్ కలిసి ఇదంతా చేస్తున్నారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news