తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందట. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి …అళ్వార్ ట్యాంక్ వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,450 మంది భక్తులు కాగా..… 43,862మంది భక్తులు…తలనీలాలు సమర్పించారు. అటు టీటీడీ ఆలయం హుండీ ఆదాయం రూ.4.21 కోట్లుగా నమోదు అయింది.
కాగా.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయంపై డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను ఆలయ SPF సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాదుకు చెందిన వారుగా గుర్తించారు. డ్రోన్ ను CRPF సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. యువకులను SPF సిబ్బంది… స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.