తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారమంతా సగటున 4 గంటలుగా ఉన్న దర్శన సమయం తాజాగా 8 గంటలకు చేరింది. వీకెండ్ కావడంతో రద్దీ ఎక్కువ ఉందని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నాలుగు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయని అధికారులు తెలిపారు.

కాగా, శుక్రవారం ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 4.31 కోట్లు రావడం విశేషం. ఆదివారం కూడా భక్తులు ఎక్కువగానే వస్తారని టీటీడీ వర్గాలు అంచనా వేశాయి. ఇక అటు తెలంగాణలో భక్తులకు శుభవార్త. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news