ఏపీలో నవంబర్‌ 1వ తేదీ నుంచే కరెంట్‌ చార్జీల పెంపు !

-

ఏపీలో నవంబర్‌ 1వ తేదీ నుంచే కరెంట్‌ చార్జీల పెంచేందుకు రెడీ అయ్యారని చంద్రబాబు సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికలకు ముందు 5 సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఓట్లు కోసం ప్రజల వద్దకు వెళ్లిందని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ చార్జీలు పెంచనున్నారన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట, ఇది చంద్రబాబు నైజం అని తెలిపారు.

Current charges increase in AP from November 1

ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచితే వైసిపి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయాలని సంకల్పిస్తిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఆసన్నమైంది. లేదంటే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబు కు షాక్ ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారని తెలిపారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారని తెలిపారు. దీపావళి నుండి గ్యాస్ ధరలు తగ్గింపు అని సంవత్సరానికి 4250 కోట్లు ఖర్చు అయితే, అదే డబ్బు విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు.

 

Read more RELATED
Recommended to you

Latest news