కిడ్నీలో రాళ్ల సమస్యకు నేరేడు ఆకులు వాడుతున్నారా..?

-

పెద్దవాళ్లు నాలుగు రాళ్లు వెనకయరా అని అంటుంటే.. మనమేమో ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ఫుడ్స్‌ తింటూ… కిడ్నీలో రాళ్లు వేసుకుంటున్నాం. ఈరోజుల్లో చాలమందికి వయసుతో సంబంధం లేకుండా ఇలా కిడ్నీలో రాళ్లు ఏర్పడి చికిత్స తీసుకుంటున్నారు. కొందరికి మందులతో కరిగిస్తే.. మరికొందరికి ఆపరేషన్‌ వరకూ వెళ్లాల్సి వస్తుంది. నాచురల్గా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకటి. అదే నేరడు ఆకు. నేరేడు పండు డయబెటిక్‌ పేషంట్లకు బెస్ట్‌ అయితే..ఈ చెట్టు ఆకులు కిడ్నీ బాధితులకు దివ్యఔషధంగా పనిచేస్తాయి. నేరేడు ఆకుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మీరే చూడండి..

  • అల్సర్లను త‌గ్గించే గుణం కూడా ఈ నేరేడు ఆకులకు ఉంది.
  • నేరేడు ఆకులు మ‌ల‌బ‌ద్దకాన్ని, అల‌ర్జీల‌ను త‌గ్గిస్తాయి.
  • చిగుళ్ల స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారికి నేరేడు ఆకులు చక్కటి పరిష్కారం.
  • కణితులను నివారించడం ఈ ఆకు మంచి ప్రయోజనంగా ఉంటుంది..
  • క్యాన్సర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో కూడా నేరేడు ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
  • ఈ ఆకుల నుండి తీసిన నూనెను ప‌ర్ ఫ్యూమ్స్, స‌బ్బుల త‌యారీలో ఉప‌యోగిస్తారు.
  • నేరేడు ఆకుల ర‌సాన్ని నోట్లోవేసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేయడం వలన దంత సమస్యలు తగ్గుతాయి.
  • అరి కాళ్ళు, అరి చేతులు మంటలు వేస్తుంటే.. నేరేడు ఆకుల ర‌సంలో తేనెను క‌లిపి తాగ‌డం మంచి ఫలితం ఉంటుంది.
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు ఆకులు మంచి ఔషధం. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.
  • నేరేడు ఆకుల్లో యాంటీ వైర‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరం వ్యాధి బారిన ప‌డ‌కుండా చేస్తాయి..
  • కిడ్నీల్లో రాళ్ల స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న వారికీ దివ్య ఔషధం. 10 నుండి 15 గ్రాముల నేరేడు ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటికి 4 న‌ల్ల మిరియాలు క‌లిపి పేస్ట్‌గా చేయాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసుకుని జ్యూస్‌గా చేసుకుని రోజు తాగుతుండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..మీకు నేరేడు ఆకులు దొరికితే అవసరం అనిపిస్తే వాడి చూడండి.

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news