టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడం జరిగింది. న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్ పాటు యాంకర్ సింధూర శివపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు న్యాయవాది ఇమ్మానేని రామారావు.
ఈ నెల 17న ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించప రిచేలా విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని.. తెలిపారు. అంతేకాకుండా ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం.. ఇది కోర్టు ధిక్కరణేకాక, సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, ధిక్కరణ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు న్యాయవాది ఇమ్మానేని రామారావు.
టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
న్యాయస్థానాల్లో జరిగే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్ పాటు యాంకర్ సింధూర శివపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు… pic.twitter.com/68JO01vMTC
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024