AP: వణికిస్తున్న ఫెంగాల్ తుఫాన్.. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు !

-

AP: ఏపీని ఫెంగాల్ తుఫాన్ వణికిస్తోంది. దీంతో తిరుపతి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. “ఫెంగాల్” తుఫాను మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం గంటకు 13 కి.మీ వేగంతో పయనిస్తోంది. ఇవాళ సాయంత్రం పుదుచ్చేరికి సమీపంలోని కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీరం దాటి తుఫాన్ గానే కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Cyclone Fengal Alert To AP holidays to schools and colleges

పుదుచ్చేరికి తూర్పు-ఈశాన్యంగా 120 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 110 కి.మీ, నాగపట్టినానికి 200 కి.మీ ఉత్తర-ఈశాన్య దిశలో వుంది. “ఫెంగాల్” తీరం దాటే సమయంలో గరిష్టంగా 90కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఫెంగాల్ తుఫాన్ నేపథ్యంలో మధ్యాహ్నం నుండి తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలకు సెలవు‌‌ ప్రకటించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.

Read more RELATED
Recommended to you

Latest news