డైలాగ్ ఆఫ్ ద డే : అట్లుంటది బాల‌య్య‌తో !

-

ప్ర‌స్తుతం బాల‌య్య హ‌వా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. అఖండ సినిమా విజ‌యం త‌రువాత ఆయ‌న 107 వ చిత్రం  షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఓ ఇంట్ర‌స్టింగ్ పాయింట్ తో  గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ సినిమా త‌రువాత కూడా బాల‌య్య వేగం ఎక్కడా ఆగేలా లేదు. ఎందుకంటే ఆయ‌న వ‌రుస క‌మిట్మెంట్ లు అలా ఉన్నాయి. జ‌యాప‌జ‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని హీరోగానే కాదు, రికార్డుల తిరగ‌మోత‌లోనూ ఆయ‌నే నంబ‌ర్ ఒన్ అని అనిపించుకున్న దాఖ‌లాలు ఎన్నో !

పెద్దాయ‌న ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్ని అందుకుని ముందుకు దూసుకుపోతున్న వైనం న‌భూతో ! అదేవిధంగా వెండి తెర మెరుపులే కాదు బుల్లి తెర‌పై కూడా ఆయ‌న‌కు తిరుగు లేద‌ని నిరూపించుకున్నారు. ఆహా ఓటీటీలో అన్ స్టాప‌బుల్ పేరిట ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో టాక్ షో ఒక‌టి నిర్వ‌హించి నంబ‌ర్ ఒన్ రేటింగ్ ఉన్న ప్రొగ్రాంగా మ‌లిచారు. ఓటీటీ చ‌రిత్ర‌లోనే మరో అధ్యాయాన్ని లిఖించారు. మ‌నల్ని ద్వేషించిన వారిని సైతం ప్రేమిస్తే అదొక గొప్ప ఆనందాల‌కు సంకేతం అవుతుంది అని కూడా చెప్పారు. కొత్త త‌రానికి కొత్త త‌ర‌హా ప్రెజెంటేష‌న్ అందించి ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న పాపుల‌ర్ అయ్యారు. ఓ ద‌శ‌లో బాలీవుడ్ కూడా ఓటీటీలో ఆహా షో రేటింగ్స్ చూసి అవాక్క‌యింది.

 తెర‌పై బాల‌య్య వేరు, నిజ జీవితంలో బాల‌య్య వేరు అని నిరూపించారు ఆయ‌న. నిండు మ‌నసుతో స్వ‌చ్ఛ‌మ‌యిన ప్రేమతో ఆయన అతిథుల‌ను ప‌ల‌క‌రించారు. వారి జీవితాల‌ను అర్థం చేసుకుని వారితో మ‌మేకం అయిన తీరు న‌భూతో ! ఇదే సంద‌ర్భంలో మ‌రో సారి అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 కు సిద్ధం అవుతున్నారు.ఆ రోజు ఆ షోకు బాల‌య్య సాయం పొందిన ఓ చిన్నారి వ‌చ్చి త‌న ప్రేమ‌ను పంచి వెళ్లింది. ఆయ‌న ఆల‌యం బ‌స‌వ తార‌కం ఆస్ప‌త్రి అని మ‌నంద‌రికీ తెలుసు. ఆ ఆల‌యం నుంచి వ‌చ్చిన ఓ చిన్నారి దేవ‌త ఆయ‌న గురించి ఆయ‌న చేసిన సాయం గురించి చెప్పి అంద‌రినీ క‌ద‌లించింది. గుండె ద్ర‌వించేలా చేసింది.
తాజాగా ఇప్పుడు మ‌రో మంచి ప‌నికి శ్రీ‌కారం దిద్దుతున్నారు ఆయ‌న. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న సొంత నిధుల‌తో 25 కోట్ల రూపాయ‌లు వెచ్చించి డ‌యాల‌సిస్ సెంట‌ర్ ను ఏర్పాటుకు బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే ఈ ప్రాథ‌మిక వివ‌రం తెలిసిన బాల‌య్య అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఆయ‌న గొప్ప మ‌న‌సుకు జేజేలు చెబుతున్నారు. ద‌టీజ్ బాల‌య్య.. అన్ స్టాప‌బుల్ బాల‌య్య అని కీర్తిస్తున్నారు. ఆయ‌న‌కు అఖండ ఖ్యాతి ద‌క్కాల‌ని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెబుదాం మ‌నం కూడా !

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version