తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఎనిమిదేళ్ల నుంచి మోసం చేస్తున్నారని… కానీ కేసీఆర్ మాత్రం నాలుగు నెలల్లో ప్రగతి భవన్ పేరుతో ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మనం పన్నుల రూపంలో కట్టిన పైసలతో ఇంద్ర భవనం కట్టుకున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు పరచడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చి ఏడాదికి రూ. 5 లక్షలతో వైద్య సహాయం అందిస్తున్నారు.
పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేవు…. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నాడు: కిషన్ రెడ్డి
-