దళిత మహిళపై అచ్చెన్నాయుడు అనుచరుడు లైంగిక దాడి చేశాడు. దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బిలి రవి కుమార్ కీచకపర్వం తాజాగా బయట పడింది. మంత్రి అచ్చెన్న అనుచరుడిగా రవి కుమార్ కు ముద్ర పడింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేశాడట టీడీపీ నేత పెబ్బిలి రవి కుమార్. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీశారు దళిత మహిళ పిన్ని, బాబాయ్ రవి కుమార్.
శ్రీకాకుళంకు చెందిన వ్యక్తితో బాధిత మహిళకు మొదటి వివాహం చేశారు. భార్య భర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్.. ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు. లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మాలేషియాకు తరలించాడు. బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు వస్తుందేమోనని భయపడి విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రసవం చేయించాడు.. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రినని రవి కుమార్ సంతకం చేశాడు. ఆ తరువాత దగ్గరుండి రెండవ వివాహం జరిపించాడు రవి కుమార్. బాధితరాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. చేసేదేమి లేక పోలీసులను బాధితురాలు ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.