ే విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో సుమారు 18 మంది మృతి చెందినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ప్రధాని మోడీ, యూపీ సీఎం సైతం సంతాపం వ్యక్తం చేశారు.
మృతులకు రూ.10లక్షల నష్టపరిహారం సైతం ప్రకటించారు. అయితే, ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 13,14వ ఫ్లాట్ ఫామ్స్ మీద కొన్ని గంటలుగా రైలు కోసం ఎదురుచూస్తున్నారు. రైలు రావడంతో సీట్లు దొరకవని ఒక్కసారిగా ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కసలాట జరగగా మరణాలు సంభవించాయి. మృతుల్లో అధికంగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. కాగా, తాజాగా న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://twitter.com/ChotaNewsApp/status/1890998648345071911