జైల్లో చంద్రబాబు భద్రతపై ఆందోళన.. మావోయిస్టుల నుంచి ప్రాణహాని

-

స్కిల్ డెవల్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్రా కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కారాగారంలో చంద్రబాబు భద్రతపై ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆయన్ను మావోయిస్టులు, వాళ్ల సానుభూతిపరులున్న జైల్లో ఉంచడంతో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కరడుగట్టిన నేరగాళ్లు, హంతకులు, సుపారీ గ్యాంగులు, రౌడీషీటర్లు, తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడినవారు, గంజాయి స్మగ్లర్లు ఉన్నచోట చంద్రబాబును ఉంచటం వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. కారాగారంలో కేటాయించిన బ్యారెక్‌లో తప్ప బయట తిరగొద్దని చంద్రబాబుకు జైలు అధికారులే సూచించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే ఆయన భద్రత ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. జైలుకు పంపటంతో అక్కడ ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రత లేకుండా పోయింది. కేవలం నలుగురైదుగురు జైలు సిబ్బంది షిఫ్టుల వారీగా కర్రలతో కాపలా ఉంటున్నారు. ఏ మావోయిస్టుల వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రత కల్పించారో, అదే మావోయిస్టులున్న చోట ఇప్పుడు ఎన్‌ఎస్‌జీ భద్రత లేకుండా ఉంచటంపై ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version