ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు బిగ్ అలర్ట్. ఇకపై విశ్రాంత జవాన్లు అలాగే వితంతువులకు పెన్షన్ సదుపాయం కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. సర్వీస్ పూర్తవ్వకుండా అనివార్య కారణాలతో వచ్చేసిన జవాన్లు అలాగే ఇప్పటివరకు పెన్షన్ అందుకొని వీతంతువులకు నెలకు 3000 రూపాయల నుంచి 5000 వరకు పెన్షన్ ఇవ్వాలని మాజీ సైనికుల ప్రత్యేక నిధి రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది.

గవర్నర్తో భేటీలో కొన్ని ప్రతిపాదనలకు ఆమోదం కూడా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అనాధలైన మాజీ సైనికుల పిల్లల చదువు కోసం 30000 రూపాయలు అలాగే అమరవీరుల విగ్రహం కోసం 15 లక్షలు వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే అమలు అయితే.. సర్వీస్ పూర్తవకుండా అనివార్య కారణాలతో వచ్చేసిన జవాన్లు అలాగే ఇప్పటివరకు పెన్షన్ అందుకొని వారికి లాభం చేకూర బోతోంది.