ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ జగన్ హయాంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో వాలంటీర్ల పై ప్రభుత్వం పక్కన పెట్టిందని ప్రతిపక్ష వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా వాలంటీర్ల వ్యవస్థ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ఏపీలోని సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో తాజాగా భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలన్న సర్పంచ్ ల విజ్ఞప్తుల పై పవన్ కళ్యాణ్ స్పందించారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం భావిస్తోంది. కానీ గత ప్రభుత్వం వారిని చాలా మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదే సాంకేతిక సమస్య అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు రకరకాలుగా మాట్లాడటం గమనార్హం.