భారత్ -భూటాన్ మధ్య ఇమ్మిగ్రేషన్ ప్రారంభించిన బండి సంజయ్

-

చాలా కాలం తర్వాత భారత్ – భూటాన్ దేశాల మధ్య చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. అసోంలోని దరంగా వద్ద భారత్ – భూటాన్ సరిహద్దులో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని శెరింగె తోబ్గే, అసోం గవర్నర్ ఆచార్య లక్ష్మణ్ ప్రసాద్, విదేశాంగ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గరీటా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుతో పొరుగు దేశాలతో భారత్ రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని చెప్పారు. లాజిస్టిక్ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని సమాచారం. భారత్ తన పొరుగును ఉన్న దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేస్తుందని, అది భారత్ అభిమతమని బండి సంజయ్ వివరించారు.భారత్ – భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రామాణికత ఏర్పడిందని, ఇరు దేశాల మధ్య స్నేహం, సహకారం, సామాజికత ఇలాగే కొనసాగాలని బండి సంజయ్ ఆకాక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version