ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..

-

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ జరిగింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 26 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శ్రీ కాళహస్తి ఆలయం ఈవో గా డి.పెద్ది రాజు నియమితులు అయ్యారు. ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఈవో గా కిరణ్ కుమార్ నియమితులు అయ్యారు. అలానే విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ ఈవో గా డి.వెంకటేశ్వర రావు, తూర్పుగోదావరి జెడ్పీ సీఈవో గా ఎన్వీవీ సత్యనారాయణలు నియమితులయ్యారు.

ap govt decided to increase districts

గుంటూరు డీఆర్వో గా సి.చంద్ర శేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆసరా, సంక్షేమం జేసీ గా జె. శివ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇక బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లు వీరే, వి. సుబ్బారావు, డి. కోదండరామిరెడ్డి, వీకే సీనా నాయక్‌, ఎన్వీవీ సత్యనారాయణ, టి. భాస్కర్‌ నాయుడు, ఎ. లక్ష్మీ కుమారి, ఏబీవీఎస్‌బీ శ్రీనివాస్‌, ఎం.డి. ఝాన్సీరాణి, సి. చంద్రశేఖర్‌ రెడ్డి, ఎం. వెంకట సుధాకర్‌, పి. భవానీ, జె. శివ శ్రీనివాసు, ఎస్‌. సరళా వందనం, కె. రాములు నాయక్‌, కె. అడ్డయ్య, కిరణ్‌ కుమార్‌, ఎం. శ్రీనివాసులు, ఎ. చంద్ర మోహన్‌, బి. శ్రీనివాసరావు, ఆర్‌. ప్రభాకర్‌రావు, డి. పెద్దిరాజు, డి. వెంకటేశ్వరరావు, జి. శ్రీనివాసులు, హెచ్‌. సుబ్బరాజు, వైవీ సత్య భాస్కర్‌, శ్రీకాంత్‌ ప్రభాకర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version