జగన్ తమకు నచ్చిన పనిచేయకపోయినా.. తమను ఇబ్బంది పెట్టినట్లుగా భావించినా.. ఆఖరికి జగన్ ఏమి చేసినా అందులో తప్పులు వెతకడం, కోడి గుడ్డుపై ఈకలు పీకే కార్యక్రమం చెయడం, అది కూడా బాబుకు అనుకూలంగా మార్చడం చేస్తుంటుంది అనే పేరు పుష్కలంగా సంపాదించుకుంది ఆంధ్రజ్యోతి పత్రిక! ప్రస్తుతం జగన్ చేసిన ఒక పని విషయంలో జగన్ ను వ్యతిరేకిస్తే జనాలు తన్నుతారనో, చింపుతారనో తెలియదు కానీ… ఆ పనికి కారణం తామే అన్న రేంజ్ లో ఒక వార్తను అందించింది!
అవును… జగన్ ఏమి చేసినా తప్పే అన్న చందంగా దూసుకుపోతున్న ఆంధ్రజ్యోతి పత్రిక… తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై చోడవరం దగ్గర బ్యారేజీ నిర్మించాలని “క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న” నేపథ్యంలో, చోడవరం బ్యారేజీకి అనుసంధానంగా కృష్ణా తూర్పు ప్రాంతంలో విజయవాడ వెలుపల నుంచి బైపాస్ ను నిర్మించటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బైపాస్ కు కేంద్రం నిధులు ఇస్తే అటు బ్రిడ్జి, ఇటు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టవచ్చునని జగన్.. గడ్కరీ వద్ద ప్రస్థావించారు! అయితే అది మా పేపర్ లో రాసిన విషయం అంటున్నారు ఆర్కే!
ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ఆంధ్రజ్యోతి కథనంలో సూచించిన అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 78 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణాన్ని చేపట్టాలని గడ్కరీని కోరారు. అంటూ చెప్పుకొస్తుంది ఆంధ్రజ్యోతి! ఇంతకూ జగన్ రాష్ట్రం గురించి ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకున్నట్లా లేక ఆంధ్రజ్యోతి చెప్పింది కాబట్టి అప్పుడు అది మంచిదని తెలుసుకుని నిర్ణయం తీసుకున్నట్లా? లేకపోతే తాము సూచించాము కాబట్టే జగన్ కు ఆ ఆలోచన వచ్చిందని చెప్పడమా? ఇంతకూ… జగన్ బెస్ట్ సీఎం ఆ కాదా? జ్యోతికి నచ్చని మాట ఇది! కానీ జనాలు మెచ్చుతున్న సంగతి ఇది!!