విరాళాలు మొత్తం… కూటమి నేతల జేబుల్లో వేసుకున్నారు – దేవినేని అవినాష్

-

విరాళాలు మొత్తం… కూటమి నేతల జేబుల్లో వేసుకున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపణలు చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వమని… వరదలను పబ్లిసిటీకి వాడుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదంటూ వ్యాఖ్యానించారు. విరాళాలలో కూడా అవినీతికి పాల్పడ్డారని… పేదలు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మంతా వరదల్లో కొట్టుకుపోయినా ప్రభుత్వానికి పట్టింపులేదని ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్.

అసలు వచ్చిన విరాళాలన్నీ ఏం అయ్యాయి? పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయకుండా కోటి 40 లక్షలు కొట్టేశారని ఆరోపణలు చేశారు. రూ.368 కోట్లు భోజనాలకు ఖర్చు పెట్టారంట… మంచినీళ్ల కోసం రూ.26 కోట్లు ఖర్చు పెట్టారంట అంటూ చురకలు అంటించారు. దీపాలు, కొవ్వుత్తులకు 23 కోట్లు ఖర్చంట… రూ.534 కోట్లు వరదల కోసం ఖర్చు పెట్టామంటున్నారని ఫైర్‌ అయ్యారు. బాధితులకు ఇవ్వకుండా నే ఇచ్చినట్టు రాసుకున్నారు… విరాళాలను సొంత జేబుల్లోకి వేసుకున్నారని మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version