Arogyashri : ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ

-

ఏపీ ప్రజలకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్‌. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి చెల్లుబోయిన వేణు అధికారిక ప్రకటన చేశారు. నిన్న ఏపీ కేబినేట్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశం అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. మరింత మెరుగైన ఫీచర్సుతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామన్నారు.

Distribution of Arogyashri new cards on 18th of this mont

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతాం.. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టాం.. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని వివరించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరి చేస్తామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు.

Read more RELATED
Recommended to you

Latest news